BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే…
Pakistan Record: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి పాకిస్తాన్ రికార్డు సృష్టించింది. ఒక జట్టుపై అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కు ఇది 18వ విజయం. ఇన్ని మ్యాచ్‌ల్లో మరే జట్టు ప్రత్యర్థిపై గెలుపొందలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్‌పై 17 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డు ఇంగ్లండ్‌పై ఉంది. శ్రీలంక, వెస్టిండీస్‌పై కూడా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్పుడు ఆ జట్లను పాకిస్థాన్ అధిగమించి సరికొత్త రికార్డును తన…
IPL 2023: గత రెండేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మెగా టీ20 లీగ్‌ను విదేశాల్లో నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఇండియాలోనే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు మినీ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలంలో పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్రాంచైజీకి అదనంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం ఈ రూ.5 కోట్లకు అదనం. ఐపీఎల్…
Jos Buttler: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంటోంది. మెగా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. గురువారం రెండో సెమీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఫైనల్ పోరుకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ తలపడాలని కోరుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఈ అంశంపై స్పందించాడు. ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదని.. తాము ఉండనివ్వమని స్పష్టం చేశాడు. రెండో సెమీస్‌లో టీమిండియాను ఓడిస్తామని…
T20 World Cup: క్రికెట్లో న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. గ్రూప్ స్టేజీలో దుమ్మురేపేలా ఆడతారు. నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఒక ఫోబియా ఉంటే.. న్యూజిలాండ్ జట్టుకు మరో ఫోబియా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చూసుకుంటే 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్.. ఇలా మూడు ప్రపంచకప్‌లలోనూ న్యూజిలాండ్ బోల్తా కొట్టింది. దీంతో పాపం న్యూజిలాండ్ అనిపించక మానదు. పలువురు అభిమానులు అయ్యో…
Roger Binny: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం…
IND Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకే ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో రాణించని దీపక్ హుడాపై వేటు వేసింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లాంటి అగ్ర జట్టును ఓడించిన జింబాబ్వేకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్…
Darren Sammy: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తమ జట్టుకు ఈ పరిస్థితి దాపురించడానికి ఆర్ధిక విధానాలే కారణమని ఆరోపించాడు. ఆటగాళ్లకు తమ బోర్డు ఆర్ధిక భద్రత కల్పిస్తే జట్టు గాడిన పడుతుందని డారెన్ సామీ ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తరహాలో ఇతర లీగుల్లో తమ ఆటగాళ్లు ఆడటాన్ని వెస్టిండీస్ బోర్డు అడ్డుకోలేదని..…