Virat Kohli: శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా సచిన్ సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ సొంతగడ్డపై 164 వన్డేలలో 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. కోహ్లీ స్వదేశంలో 101 వన్డేల్లో 19 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడు.
Read Also: Nabha Natesh: అమ్మడు వెనకపడింది అందుకేనట!
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో రెండు శతకాలు బాదితే 50 ఓవర్ల ఫార్మాట్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్‌ను దాటిపోతాడు. అటు శ్రీలంకపై 84 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 8 సెంచరీలు చేశాడు. అయితే విరాట్ కోహ్లి 60 మ్యాచ్‌లలోనే ఆ టీమ్‌పై 8 సెంచరీలు చేయడం విశేషం. శ్రీలంకపై విరాట్ కోహ్లీ 2220 పరుగులు చేయగా సచిన్ 3113 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. మరోవైపు వన్డేల్లో ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు చేసిన టాప్-5లో చేరే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి ఉంది. ఇందుకోసం విరాట్ ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో సచిన్ 18,426 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430), మహేల జయవర్దనె (12,650) ఉన్నారు.