Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ…
Stump Out: ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. అయితే ఈ టెస్టులో అరుదైన సీన్ చోటు చేసుకుంది. దీంతో 145 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని రికార్డును న్యూజిలాండ్ కీపర్ బ్లండెల్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా తొలి రెండు వికెట్లను స్టంపౌట్ రూపంలోనే కోల్పోయింది. అబ్దుల్లా షఫిఖ్ (7), షాన్…
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.…
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క…
World Test Championship: బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిది విజయాలు, నాలుగు ఓటములతో 99 పాయింట్లతో 58.93 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు, ఒక ఓటమితో 120 పాయింట్లు సాధించింది.…
Team India: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను నెగ్గడానికి టీమిండియా తల ప్రాణం తోకకు వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రెండో టెస్టులో ఓటమి దిశగా సాగి భారత ఆటగాళ్లు కలవరపెట్టారు. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, ఆల్‌రౌండర్ అశ్విన్ భారత్ పరువు కాపాడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే తదుపరి సిరీస్‌పై అందరి కన్ను పడింది. స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా…
IND Vs BAN: మీర్పూర్ టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), పుజారా (6), విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. క్రీజులో అక్షర్ పటేల్ (26), జైదేవ్ ఉనద్కట్ (3) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో…
IND Vs BAN: మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్…
IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ 2023 టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే మినీ వేలం ముగిసిన తర్వాత ఎప్పటి లాగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తంలో…
IPL Auction 2023 Live Updates: ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లే రికార్డులు బ్రేకయ్యాయి. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో శామ్ కరణ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ముంబై 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు…