Australia Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా.. ఆదివారం నాడు మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా నాదల్ బాటలోనే నడిచింది. నాలుగో రౌండ్‌లో 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో స్వైటెక్ పరాజయం పాలైంది. తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్.. రెండో సెట్‌లో అయినా పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమె పేలవ ఆటతీరుతో ఓటమి కొనితెచ్చుకుంది.
Read Also: Google Layoff: 8 నెలల గర్భిణి.. వారం రోజుల్లో మెటర్నిటీ లీవ్.. అంతలోనే ఉద్యోగం ఔట్..
కాగా ఈ పోరు కేవలం గంటన్నరలో ముగిసింది. రైబాకినా గతేడాది వింబుల్డన్ గెలిచి సత్తా చాటింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. జెలెనా ఓస్టాపెంకో, కోకో గాఫ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో రైబాకినా క్వార్టర్ ఫైనల్స్ పోరులో తలపడనుంది. అటు పురుషుల సింగిల్స్ పోరులో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. మూడో సీడ్ సిట్సిపాస్ ఆదివారం నాడు ఐదు సెట్ల పాటు జరిగిన మ్యాచ్ లో 6-4, 6-4, 3-6, 4-6, 6-3తో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు. ముఖ్యంగా చివరి సెట్‌లో భారీ సర్వీసులు, బలమైన గ్రౌండ్ షాట్లతో సిన్నర్‌ను సిట్సిపాస్ నిస్సహాయుడిగా మార్చేశాడు.