దసరా సెలవులు కూడా తోడు కావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వేశాఖ. పర్యాటకుల రద్దీని క్యాష్ చేసుకునే విధంగా.. ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.. ఈనెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అరకుకు ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ. దసరా సీజన్ సందర్భంగా పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది.