దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది.
Vande Bharat Express: వందే భారత్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల ప్రయాణ కాలం తగ్గుతుంది. అయితే ఈ రైలులో ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా అప్ గ్రేడ్ చేస్తోంది రైల్వేశాఖ. ఇక కొత్తగా రూపొందిస్తున్న వందేభారత్ రైళ్లలో సాంకేతికతను ఉపయోగించి ప్రమాదాలను తగ్గించాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. దీని కోసం విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ సదుపాయాన్ని వందేభారత్ రైలులో కూడా కల్పిస్తోంది. కొత్తగా రూపొందిస్తున్న వందే భారత్లో…