మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ప్రకటించింది. శివరాత్రి సందర్భంగా ఏపీలోని 96 శైవక్షేత్రాలకు 3,225 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆయా బస్సుల్లో గతంలో మాదిరిగానే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, శ్రీశైలానికి 390 బస్సులు నడపనున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన, పశ్చిమ గోదావరి జిల్లాలోని బలివె, పట్టిసీమ తదితర…
సంక్రాంతి పండగ సందర్భంగా భాగ్యనగరంలోని ప్రజలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించేవారు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే సంక్రాంతి పండగ పూర్తి కావడంతో స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాంటి వారి కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. అయితే సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోప్రత్యేక బస్సులు ఈ నెల 7 నుంచి 14 వరకు నడపనున్నట్టు వెల్లడించారు. 4,318 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు నడుస్తాయని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా భారీ సంఖ్యలో టీఎస్…
మరో 10 రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. అతి పెద్ద పండగ కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సొంతూళ్ల బాట పడతారు. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ప్రత్యేకంగా 6,970 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పండుగకు ముందు 4,145 బస్సులు, ఆ తర్వాత 2825 బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 8వ తేదీ నుంచి ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లో…
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు…
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్‌లో ప్రత్యేక బస్సులను…