ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రైళ్లు, బస్సులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.