Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండగా మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తుంది.
రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది.
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Monsoon: జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించబోతున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4 తేదీన కేరళలోకి ప్రవేశిస్తున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది.
Monsoon: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం 90 శాతం ఉందని తెలిపింది. గతంలో ఎల్ నీనో ఏర్పడిన పలు సందర్భాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు…
Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఈ రోజు వెల్లడించింది. జూన్ 4 నాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. సాధారణంగా ఏడు రోజులకు అటుఇటుగా జూన్ 1 న కేరళలోకి ప్రవేశిస్తాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్‌పేట్, పంజాగుట్ట,…
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నగరవ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది. నైరుతి రుతుపవన కాలంలో తొలిసారిగా నగరంలో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో నగరం అంతటా వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై దక్షిణ ప్రాంతంలో రోజంతా వర్షం కురసింది. బీఏ అంబేద్కర్ రోడ్, బ్రీచ్ క్యాండీ, జేజే ఫ్లై ఓవర్, వర్లీ, కమలా మిల్స్ కాంపౌండ్, అంధేరి, మాతుంగా, కుర్లా, శాంతాక్రూజ్ ప్రాంతాల్లో భారీ…
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్ 13.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాది కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 11.13 వర్షపాతం నమోదైంది. జయశంకర్ జిల్లా…