వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోకి రేపు (సోమవారం) నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో…
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భాగ్యనంగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో జల్లులు కురుసాయి. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా…
రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, దక్షిణ…
గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ). భారత వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖగా భావించే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. సాధారణం కన్నా మూడు రోజుల ముందే మే 29న కేంద్రంలోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ సారి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి వ్యాపించాయి. అయితే అంతకుముందు బంగాళా ఖాతంలో అసనీ తుఫాన్…
భారత దేశ రైతాంగానికి శుభవార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. భారత్‌లోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.., అండమాన్‌ను తాకాయి నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతోన్న నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు పూర్తిగా విస్తరించినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది ఐఎండీ. Read Also: Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..! ఇక, నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో…
భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి,…
ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే…
నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశమంతటా విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జులై 8న నైరుతి రుతుపవనాలు దేశమంతటికీ విస్తరిస్తుంటాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో చిట్టచివరిగా వర్షాలు కురిసే రాజస్థాన్‌లోని జైసల్మేర్, గంగానగర్‌కు వర్షాలు విస్తరించినప్పటికీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మాత్రం మొహం చాటేశాయి. కాగా, మంగళవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా వర్షాలు పడడంతో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని…
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు.. నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లో కొంత భాగంలోకి ప్రవేశించాయి… రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక, దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణ నుండి…
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి… ముందుగా అంచనా వేసిన ప్రకారం జూన్ 1వ తేదీకి రెండు రోజులు ఆసల్యంగా కేరళలను తాకాయి రుతుపవనాలు.. ఇవాళ ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.. ఈ నెల 1వ తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా.. రెండు రోజులు ఆలస్యంగా వచ్చినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు.. వీటి ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు.. కాగా, గాలి వేగం, వర్షపాత స్థిరత్వం,…