Thugs threatened Fabian Allen with a gun in South Africa: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న అలెన్‌ను కొందరు దుండగలు తుపాకితో బెదరించి.. అతడి సెల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్టన్ సన్ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి…
Heinrich Klaasen Test Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని క్లాసెన్ పేర్కొన్నాడు. 2019 నుంచి 2023 మధ్య దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు…
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది.
ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుందని, ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా వేసిన కేసుల జనవరి 11, 12న విచారిస్తామని కోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. జెనోసైడ్ కన్వెన్షన్ కింద ఇజ్రాయెల్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, గాజా ప్రజలపై మారణహోమానికి పాల్పడుతోందని, ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతోందని దక్షిణాఫ్రికా గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అవుతుంది.
కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్ట్ లో విజయం సాధించాలనే ఉద్దేశంతో టీమ్ రంగంలోకి దిగనుంది. ఇదిలా ఉంటే.. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో భారత్ రికార్డు బాగోలేదు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేదు.
సౌతాఫ్రికాతో సెంచూరియన్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఈ విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. 163 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. 131 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 76 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాట్స్ మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ,…
సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) సెంచరీ చేయగా.. మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో ఈ వరుసకు బ్రేక్ వేసేందుకు టీమిండియా కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.