Not MS Dhoni and Gilchrist, Quinton de Kock scripts history in ODI World Cup: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచే డికాక్ కెరీర్లో చివరిది. తాను ఆడిన చివరి వన్డేలో డికాక్‌కు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో 14 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతేకాదు…
When the chokers wear off for South Africa in ODI World Cups: వన్డే ప్రపంచకప్‌లు ఎన్ని వస్తున్నా.. దక్షిణాఫ్రికా జట్టు రాత మాత్రం మారడం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా టీమ్ నిజం చేసింది. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. దాంతో ‘చోకర్స్’…
వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియా జట్టు ఈ పరుగులు చేయకుండ ఉండటానికి.. జట్టుకు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ అవసరం. అలాంటి క్రమంలో సౌతాఫ్రికా జట్టులో ఫీల్డింగ్ లో కొంత వైఫల్యం ఏర్పడినప్పటికీ.. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మాత్రం ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు.
2023 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి తగిలాడు. ముందుగానే వాతావరణ సంస్థలు చెప్పిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాప్రికా 14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా రేపు, ఎల్లుండి సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీస్ కు చేరిన లిస్ట్ లో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బలమైన జట్లు ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు సంబంధించి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఆడబోయే రెండు జట్ల గురించి ఆమ్లా జోస్యం చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ నిష్క్రమించింది.ా
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు.