Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heinrich Klaasen Test Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని క్లాసెన్ పేర్కొన్నాడు. 2019 నుంచి 2023 మధ్య దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
‘టెస్ట్‌ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ.. కొన్ని నిద్రలేని రాత్రులు గడిపా. సరైన నిర్ణయం తీసుకుంటున్నానా? అని చాలా ఆలోచించా. చివరకు నేను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన ఫార్మాట్’ అని హెన్రిచ్ క్లాసెన్ తెలిపాడు. 4 టెస్ట్‌ల్లో క్లాసెన్ 104 పరుగులు మాత్రమే చేశాడు. 10 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. క్లాసెన్ 2019లో టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన సమయంలో క్వింటన్ డికాక్ అప్పటికే జట్టులో స్థిరపడిపోయాడు. దాంతో క్లాసెన్‌కు సరైన అవకాశాలు రాలేదు. విధ్వంసకర ఆటగాడు అనే ముద్ర కూడా సెలెక్టర్లు టెస్ట్ జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ఇంకో కారణం.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హెన్రిచ్ క్లాసెన్‌కు మంచి రికార్డు ఉంది. 85 మ్యాచ్‌ల్లో 46.09 సగటుతో 5347 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉండగా.. కెరీర్-బెస్ట్ స్కోర్ 292. వన్డే, టీ20ల్లో కూడా క్లాసెన్‌కు మంచి రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో 1723 పరుగులు చేశాడు. 43 టీ20ల్లో 4 అర్ధ సెంచరీలతో 722 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!