సెంచూరియన్ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా-టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేసి టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 245 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. కేఎల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
నేటి నుంచి భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇవాళ జోహన్నెస్‌బర్గ్ వేదికగాఇమధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ఆరంభం కాబోతుంది.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డిసెంబర్ 10న జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి…
Sunil Gavaskar slams South Africa Cricket: భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. డర్బన్‌లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. ఒక్క బంతి కూడా పడకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. మైదానం మొత్తాన్ని కప్పి ఉంచే కవర్స్ కొనేంత డబ్బు కూడా దక్షిణాఫ్రికా వద్ద లేదా? అని విమర్శించారు. మైదానాన్ని కవర్స్‌తో కప్పి…
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు డర్బన్‌లోని కింగ్స్మీడ్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్యాచ్ లు సెయింట్ జార్జ్ పార్క్, న్యూ వాండరర్స్ స్టేడియాల్లో జరగనున్నాయి.
రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎ
సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా ఈరోజు(గురువారం) ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు ఈ టూర్ జరగనుంది. ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆడనున్నట్లు తెలిపింది.
South Africa: దక్షిణాఫ్రికా ప్లాటినం గనిలో భారీ ప్రమాదం జరిగింది. గనిలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారి కూలిపోయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా 200 మీటర్లు కిందకి పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 75 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు మంగళవారం తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రస్టెన్‌బర్గ్ నగరంలోని గనిలో కార్మికులు విధులు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.