ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసిన ఆలౌట్ అయింది. స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు విజయం కోసం చాలా కష్టపడింది.
ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వన్డే వరల్డ్ కప్‌లో గొప్ప టీమ్‌లు కూడా బోల్తాపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు కూడా పసికూన జట్ల ముందు బోర్లాపడుతోంది. ఆఖరికి అఫ్గానిస్తాన్ జట్టుపై కూడా చిత్తుగా ఓడి వరుస ఓటములను మూటగట్టుకుంది. ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ జట్టు.. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచి మూడింట్లో ఓటమి పాలైంది.
బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏకపక్ష మ్యాచ్లో దక్షిణాఫ్రికా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత ప్రపంచ కప్లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయాన్ని సాధించింది.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈ రోజు 23వ మ్యాచ్ దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించారు. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీం సౌతాఫ్రికాపై గెలుపొందారు. మొదట వర్షం కారణంగా ఇరు జట్లకు 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 245/8 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులు చేసి ఆలౌటైంది.
ధర్మశాలలో వర్షం కారణంగా నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ఆలస్యం అయింది. అంతకుముందు వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొంతసేపు విరామం ఇవ్వడంతో టాస్ వేశారు. అందులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగే సమయానికే మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆట మరింత ఆలస్యమయ్యేలా ఉంది.