భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 15 మందికి ఈ జట్టులో స్థానం కల్పించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్‌బర్గ్‌లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది.
15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాల అధినేతలను గ్రూప్ ఫోటోకు పోజులివ్వడానికి పిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్లో సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది.
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఒక మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు.