సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
2023 వరల్డ్ కప్‌లో భాగంగా.. రేపు (ఆదివారం) ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి టేబుల్ టాప్‌లో ఉన్న టీమిండియా మంచి జోరు ఉంది. అటు సౌతాఫ్రికా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రేపు రసవత్తరంగా జరుగబోతుంది.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసింది. కివీస్‌పై సౌతాఫ్రికా జట్టు 190 పరుగుల తేడా భారీ విజయం సాధించింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా పుణెలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది.
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసిన ఆలౌట్ అయింది. స్వల్పలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు విజయం కోసం చాలా కష్టపడింది.
ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వన్డే వరల్డ్ కప్‌లో గొప్ప టీమ్‌లు కూడా బోల్తాపడుతున్నాయి. పాకిస్థాన్ జట్టు కూడా పసికూన జట్ల ముందు బోర్లాపడుతోంది. ఆఖరికి అఫ్గానిస్తాన్ జట్టుపై కూడా చిత్తుగా ఓడి వరుస ఓటములను మూటగట్టుకుంది. ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ జట్టు.. కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచి మూడింట్లో ఓటమి పాలైంది.
బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయాన్ని సాధించింది.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.