ప్రపంచ కప్ 2023లో భాగంగా రేపు, ఎల్లుండి సెమీ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. సెమీస్ కు చేరిన లిస్ట్ లో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బలమైన జట్లు ఉన్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు సంబంధించి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఆడబోయే రెండు జట్ల గురించి ఆమ్లా జోస్యం చెప్పాడు. ప్రపంచ కప్ 2023 టైటిల్ మ్యాచ్ ఆతిథ్య భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మంచి ప్రదర్శన కనబరిచాయని తెలిపాడు. అన్ని విభాగాల్లోనూ ఇరుజట్లు బలంగా ఉన్నాయని, ఫైనల్ లో ఈ జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుందని తెలిపాడు.
Read Also: Covid 19: మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్.. కొత్త వేరియంట్ కలకలం
ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. దీనికి ముందు బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్-1 జరగనుంది. ఆ తర్వాత.. రెండో సెమీఫైనల్ కోసం రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య పోరు జరుగనుంది. రెండో సెమీ ఫైనల్ గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌కు వెళ్తాయి. ఆతిథ్య భారత్ 9 లీగ్ మ్యాచ్‌ల్లో 9 గెలువగా.. దక్షిణాఫ్రికా 7 లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Read Also: Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ ట్రాప్లో ప్రముఖ కంపెనీ.. ఉచ్చు బిగుస్తోంది..!