దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఏకంగా 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఒక్క భారత సూచీలే కాదు.. దాదాపు ఆసియా సూచీలన్నీ…