జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు భారతదేశానికి చెందిన ఏడు దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. దాయాది దేశం యొక్క ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి షకుర్ ఖాన్‌ను బుధవారం రాత్రి జైసల్మేర్‌లో నిఘా అధికారుల బృందం అరెస్ట్ చేసింది. షకుర్ ఖాన్‌పై గత కొన్ని వారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా స్థానిక వీడియోగ్రాఫర్స్ నుంచి వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కన్నడ నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితులు లేవు. దీంతో సంవత్సరం పాటు కారాగారంలోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది.