Ahmedabad Plane Crash: భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్! డేటా సేకరించడం కష్టమే! జాతీయ మీడియా కథనాలు
- భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్!
- డేటా సేకరించడం కష్టమే!
- జాతీయ మీడియా కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం అయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డేటా సేకరణ కోసం వాషింగ్టన్ డీసీకి పంపించాలని భావించారు. కానీ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం కావడంతో డేటా సేకరించడం కష్టమేనని దర్యా్ప్తు సంస్థలు భావిస్తున్నట్లు వర్గాల సమాచారం.
ఇది కూడా చదవండి: Tollywood : జులై 11న పెద్ద సినిమాకు పోటీగా చిన్న సినిమా
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఇక బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. బ్లాక్ బాక్స్‌ను ఎక్కడి పంపించాలన్న నిర్ణయాన్ని దర్యాప్తు సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇది కూడా చదవండి: Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు!
ఇదిలా ఉంటే ఎయిరిండియా విమాన ప్రమాదానికి విద్యుత్ వైఫల్యమే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విద్యుత్ అంతరాయం వల్లే విమానం కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు కూడా ఇవే విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోతున్నప్పుడు లైట్లు రెపరెపలాడుతున్నాయని… అసాధారణ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ సమస్య తలెత్తి కూలిపోయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి.
విమానంలోని ప్రధాన విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తి ఉంటుందని.. అందుకే విమానం కూలిపోయేటప్పుడు పెద్ద శబ్దం వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఏటీసీ ప్రకటనలు, శిథిలాలను పరిశీలించిన తర్వాత ప్రాథమిక పరీక్షల ద్వారా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విమానంలో విద్యుత్ లోపం ఉన్నట్లు సంకేతాలు కనిపించాయని.. ఏటీసీతో వెంటనే కమ్యూనికేషన్ తెలిపోయినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా శిథిలాల దగ్గర కూడా విద్యుత్ వ్యవస్థ దగ్గర సమస్యలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా వర్గాలు తెలిపాయి. విమానం ఒక్కసారి ఎత్తు కోల్పోతున్న సమయంలో సమీపంలో ఉన్న ప్రజలు.. లైట్లు మిణుకుమిణుకుమంటు కనిపించాయని.. అసాధారణ శబ్దాలు వినిపించాయని చెప్పారు.
ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు నిర్వహిస్తోంది. మరోవైపు హోం కార్యదర్శి అధ్యక్షతన ఒక ప్యానెల్ సమాంతర దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇలా రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. కానీ అప్పటికే ఏటీసీతో విమానం సంబంధం కోల్పోయింది. దీనికంతటికి కారణం విద్యుత్ సమస్యనే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. దీన్ని ఓపెన్ చేసేందుకు అమెరికాకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతులు రావల్సి ఉంటుంది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!