మారుతున్న వాతావరణంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల్లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఈ సమయంలో సీజనల్ ఫ్లూ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ రోగాల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పికి కారణం ఇన్ఫ్లుఎంజా వైరస్.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పాలి. రోజువారి కేసుల్లో భారీ పెరుగుదలలు కనిపిస్తున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. అనేక దేశాల్లో పరిస్థితి భారత్ కంటే మరింత దారుణంగా మారింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నా కోవడ్, ఒమిక్రాన్ సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, బాడీపెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం…