దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పాలి. రోజువారి కేసుల్లో భారీ పెరుగుదలలు కనిపిస్తున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా క్రమంగా పెరుగుతున్నది. అనేక దేశాల్లో పరిస్థితి భారత్ కంటే మరింత దారుణంగా మారింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నా కోవడ్, ఒమిక్రాన్ సోకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, బాడీపెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Read: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం…ముంబైలో 47 శాతం పెరిగిన కేసులు
కరోనా, ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నా పెద్దగా బయటకు కనిపించడం లేదని, వాతారవణంలో వచ్చే మార్పుల వలన శరీరంలో మార్పులు వస్తున్నాయని భావించకుండా వెంటనే టెస్ట్ చేయించుకొని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకొని, నిబంధనలు పాటిస్తే కరోనా, ఒమిక్రాన్ నుంచి బయటపడగలమని, నిర్లక్ష్యం చేస్తే దాని కారణంగా ఆసుపత్రుల్లో చేరాల్సి రావొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనగలమని వైద్యనిపుణులు చెబుతున్నారు.