ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ అలుముకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అప్రతమత్తం చేసింది. ఇటీవల సిరియా రాజధాని డమస్క్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది.