పార్టీ ఫెల్యూర్ పై చర్చ జరపాలని ఇంచార్జ్ మాన్నికమ్, సోనియా గాంధీకి లేఖ రాసారు వీ.హనుమంతరావు. అందులో అధినేత్రి ముందు ఇల్లు చక్కదిద్దుకోవలని చెప్పారు. కానీ తెలంగాణ పార్టీ మాత్రం పట్టించుకోవడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్న రివ్యూలు లేవు. నాడు కుంతియా, నేడు ఠాగూర్ రివ్యూలు చేయడం మర్చిపోయారు. పార్టీకి బిసిలు దూరం అవుతున్నారు. తెరాస ఈటల పోతే మరో బీసీ ఎల్. రమనను తీసుకుంటున్నారు. తెరాస బిసిల విలువను గుర్తించారు. కేరళలో పార్టీ ఓటమి రాగానే కొత్త కమిటీని ప్రకటించింది. తెలంగాణ లో 2018 నుండి కొత్త కమిటీ ప్రకటించడం లేదు. ఇంచార్జ్ లు వస్తున్నారు పోతున్నారు తప్ప పార్టీ సమస్యలను పరిష్కరించడం లేదు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోతే కూడా రివ్యూ లేదు. ప్రజల్లో మార్పు వస్తే మనం మార్పు మన పార్టీ వైపు మళ్లించడానికి చర్చ జరపాలి. పార్టీలో సమస్యలు చర్చించకుండ కొత్త కమిటీ ప్రకటిస్తే ఎట్లా అని ప్రశ్నించారు. కానీ నేను ఎవ్వరికి వెతిరేకం కాదు.. పార్టీ కష్టకాలం లో పార్టీని కాపాడడానికి నేను మాట్లాడుతా అని తెలిపారు.