పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని విమర్శించారు.. అంతకుముందే, సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. గత వారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో విడివిడిగా ప్రత్యేకంగా సమావేశమై తన డిమాండ్లను వారి ముందుంచారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇక, సంక్షోభ పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో సోనియా గాంధీ వేసిన కమిటీని 10 రోజుల క్రితం కలిశారు కెప్టెన్.
అయితే, పంజాబ్ లో ప్రధాన రాజకీయ అంశంగా మారిపోయింది “విద్యుత్ సరఫరా”.. బాదల్ హయాంలో జరిగిన ఒప్పందాల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధూ.. ప్రజలపై అదనపు భారం మోపుతూ గత అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకురావాలని కోరారు.. దీనిపై త్వరలోనే న్యాయపరమైన వ్యూహాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అంటుండగా.. కొన్ని రోజులుగా ఈ అంశంపై బీజేపీ, ఆప్ పార్టీలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.. అయితే, ఇవాళ సోనియాగాంధీతో జరిగిన సమావేశం సంతృప్తికరంగా ముగిసిందా..? ఇక సంక్షోభానికి తెరపడిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత తెలిపారు అమరీందర్ సింగ్… సిద్ధూ కోసం ఒక కీలక పోస్టుపై ఏదైనా ప్రకటన చేయబడుతుందా? అనే ప్రశ్నికు స్పందిస్తూ.. ఏ నిర్ణయమైన, ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటంది.. మేం దానిని అనుసరిస్తాం అన్నారు.. ఇటీవల, పంజాబ్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటుండగా.. సిద్ధూ మాత్రం ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం మరియు పంజాబ్ కాంగ్రెస్‌లో తనకు కీలక పదవులు కట్టబెట్టాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.