Kiran Kumar Reddy Resigns Congress Party: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ‘‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి నా రాజీనామాను అంగీకరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతే.. అంతకుమించి ఆ లేఖలో ఇంకేం రాయలేదు. తాను కాంగ్రెస్‌ని వీడడానికి గల కారణాల్ని సైతం వెల్లడించలేదు. ఇప్పుడు ఆయన పాదాలు ఎటువైపు? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలొచ్చాయి.
Kottu Satyanarayana: పవన్‌కి సబ్జెక్ట్ లేదు.. దమ్ముంటే చర్చకి రమ్మని మంత్రి ఓపెన్ ఛాలెంజ్
దీనికితోడు.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవల కిరణ్‌కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం, ఆయన బీజేపీలో చేరుతారన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ సోము వీర్రాజు ఏం మాట్లాడారంటే.. ‘‘కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు. ఆయన పార్టీలోకి వస్తే, మేము సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. 2014 వరకు యాక్టివ్‌గా ఉన్న ఆయన, ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో మెరిసిన ఆయన.. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించారు. ఆ వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ సడెన్‌గా తెరమీదకి వచ్చి, కాంగ్రెస్‌కి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం
ఇదిలావుండగా.. కిరణ్‌కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. పీలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేయగా.. కొన్ని రోజుల్లోనే ఆయన తప్పుకోవడంతో, కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అంతే.. ఎన్నికలయ్యాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు.