ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ… జగనుకు మోడీ భయం పట్టుకుంది. మోడీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల…
బద్వేల్ లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో 40వేల ఓట్లను వైసీపీ రిగ్గింగ్ చేసింది. మేము ఏం చేశామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగాము. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగింది. బద్వేల్ లో మేము ధర్మపోరాటం చేశాం, వైసీపీ అధర్మ యుద్ధం చేసింది. రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వైసీపీకి వచ్చింది.…
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన బద్వేల్ ఉప ఎన్నికకు పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దొంగఓట్లు వేయించారని ఆరోపించారు. అంతేకాకుండా 28 చోట్ల రెగ్గింగ్ జరిగిందని, వివిధ ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి దొంగఓట్లు వేయించారని అందుకే ఓటింగ్ శాతం కూడా పెరిగిందన్నారు. అధికారంలో వైసీపీ పార్టీ బద్వేల్‌లో ఓడిపోతామని తెలిసే…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. అయితే, కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలను కూర్చోవడం చర్చగా మారింది.. మరోవైపు.. పలు ప్రాంతాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.. మరోవైపు.. ఎస్సై చంద్రశేఖర్‌పై ఎస్పీ అన్భురాజన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… దీంతో.. ఎస్సై చంద్రశేఖర్‌ను ఎన్నికల విధుల నుంచి…
బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు. బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి…
ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి,…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు……
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు నేషనల్ హెల్త్ మిషనులో పని చేసిన ఉద్యోగులు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి తొలగించిందని సోము వీర్రాజుకు వివరించారు బాధితులు. కరోనా రెండు సీజన్లల్లో కష్టపడి పని చేస్తే ప్రభుత్వం మాఉద్యోగాలు ఊడగొట్టిందని సోము వీర్రాజు వద్ద బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్త నోటిఫికేషన్ వేస్తుందనే విషయాన్ని వీర్రాజు దృష్టికి తెచ్చారు బాధిత…
గత ఏడేళ్లుగా ప్రధాని మోడీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి హైవే లు, ఫ్లై ఓవర్లు, ఎయిమ్స్ వంటివి కేంద్రమే రాష్ట్రంలో నిర్మాణం చేస్తుందని.. రూ. 2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా ఎవరూ రాని దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రోడ్ల మరమత్తులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేశారని కానీ…. తాము 7 నెలల క్రితమే చేపట్టామన్నారు. టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం…