చంద్రబాబు, సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారాడు…ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ ముఖ్యమంత్రి గా తయారయ్యారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని ఆగ్రహించారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాన్ని పంచ తీర్ధాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పొంతన లేకుండా పోతుందన్నారు. మాటి మాటికీ కేంద్రం పై వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సాయం అందుతున్నప్పటికీ…
ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో 16 మందితో కోర్ కమిటీని నియమించింది బీజేపీ అధినాయకత్వం. ఎంపీలైనా సరే తమను కోర్ కమిటీ భేటీలకు పిలవడం లేదని ఇటీవలే అమిత్ షా భేటీలో ఫిర్యాదు చేశారు సీఎం రమేష్, సుజనా చౌదరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన కోర్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, సుజనా తదితరులు వున్నారు.…
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని…
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు పరిధి నుంచి తప్పించుకోవడం కోసమే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్ చెప్పారని.. ఈ మాట జగన్ అన్నారో లేదో వైసీపీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు పెట్టేందుకు అసలు ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా…
మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం ప్రభుత్వ విధాన నిర్ణయంగా భావిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా రాజధాని అభివృద్ధికి బీజేపీ నిబద్ధతతో ఉందని సోము వీర్రాజు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాయలసీమ వెనుకబాటు తననానికి ఆ ప్రాంత పాలకులే కారణమని ఆయన అన్నారు. నేతలు వనరులను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పర్సంటేజీల కోసం ప్రాజెక్టుల గురించి మాట్లడుతారు…
ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. వీళ్లు అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద అమరావతి రైతుల ఆధ్వర్యంలో బీజేపీ నేతలు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాజ్యసభ ఎంపీ…
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని…
రాష్ట్ర ప్రభుత్వం ధరలను ఎందుకు తగ్గించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశం లోని చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తే వైసీపీ మాత్రం ధరలు తగ్గించే విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ధరలు తగ్గించాలని కోరితే మంత్రులను బూతులు తిట్టడ మేంటని ఆయన జగన్‌ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా రాష్ట్రం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయదని ఆయన మండిపడ్డారు. రూ. 25…