Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్‌గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మోత్వాని తన కెరీర్‌లో చాలా విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. హన్సిక చాలా చిన్న వయస్సులోనే టెలివిజన్, బాలీవుడ్ పరిశ్రమలలో పనిచేయడం ప్రారంభించింది.
అందాల నాయిక హన్సికా మోత్వాని గత యేడాది డిసెంబర్ 4న తన బోయ్ ఫ్రెండ్ సోహెల్ ఖటూరియాను పెళ్ళి చేసుకుంది. విశేషం ఏమంటే... తన ప్రేమ పెళ్ళి.. అది జరిగిన సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆమె 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా' పేరుతో ఓ స్పెషల్ షో చేసింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది.