Hansika Motwani: క్యాస్టింగ్ కౌచ్ వార్తలపై హన్సిక సీరియస్.. గుడ్డిగా రాయొద్దంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hansika Motwani Gives Clarity On Casting Couch Comments: రీసెంట్‌గా నటి హన్సిక మోత్వానీ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్త తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో తనను ఓ స్టార్ హీరో టార్చర్ పెట్టాడని, డేట్‌కు వస్తావా అంటూ వేధించాడని, కానీ తాను అతనికి తగిన రీతిలో బుద్ధి చెప్పి పంపించానంటూ ఓ ఇంటర్వ్యూలో హన్సిక చెప్పిందని ఆ వార్త సారాంశం. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని హన్సిక ఖండించింది. తొలుత ఓ వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్ స్క్రీన్‌షాట్ షేర్ చేసి.. తానసలు క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలే చేయలేదని, ఇలాంటి చెత్త వార్తలు రాయడం ఆపండంటూ కోపంగా రియాక్ట్ అయ్యింది. అనంతరం మరో ట్వీట్‌లో.. ‘‘ఏదైనా ఒక వార్త రాసేముందు, అందులో నిజానిజాలేంటో తెలుసుకుని రాయాల్సిందిగా కోరుతున్నాను. గుడ్డిగా ఏది పడితే అది రాయొద్దు. ఇప్పుడు ఏ వార్తైతే చక్కర్లు కొడుతోందో, అలాంటి వ్యాఖ్యలు నేనెప్పుడూ చేయలేదు’’ అంటూ స్పష్టం చేసింది.
Vaibhavi Upadhyaya: కారు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
కాగా.. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హన్సిక, తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు ఆకర్షించి, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఎందరో స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కానీ, గ్లామర్ ప్రపంచంలో ఇతర కథానాయికల నుంచి పోటీ తీవ్రం కావడంతో, హన్సికకు క్రమంగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. సినీ పరిశ్రమలో తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేసింది కానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే హన్సిక గతేడాది తాను ప్రేమించిన వ్యక్తి సోహెల్ ఖతూరియాని పెళ్లి చేసుకుని, వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.
CSK vs GT: గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్కే ఘనవిజయం
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!