అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి తరువాత ట్రంప్‌ను ఫేస్బుక్, ట్విట్టర్లు బహిష్కరించాయి. గత 9 నెలల కాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కాగా, ట్రూత్ సోషల్ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. తాలిబన్ల వంటి ఉగ్రవాద సంస్థలు ట్విట్టర్‌ను వాడుతున్నాయని, అలాంటి ప్రపంచంలోనే మనమూ ఉన్నామని, ట్విటర్లో మీరు ఎంతో ప్రేమించే అమెరికా అధ్యక్షుడి నోరునొక్కేశారు. ఇది…
ప్రముఖ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. అడిగిన వివరాలను అందించకుండా జాప్యం చేస్తూ నిర్ణక్షపూరితంగా వ్యవహరించినందుకు 515 కోట్ల రూపాయల జరిమానాను విధించింది బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటర్. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ యానిమేటెడ్ సంస్థ జిఫిని ఫేస్బుక్ కొనుగోలు చేసింది. ఈ కోనుగోలు తరువాత ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా మధ్య పోటీని ఫేస్బుక్ నియంత్రిస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది. అయితే,…
ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్బుక్ ఒకటి. చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఫేస్బుక్ సేవలు ఆరు గంటలు నిలిచిపోగా ప్రపంచమే స్తంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది. ఈనెల 28న ఫేస్బుక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో మార్క్…
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం…
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిన్న ప్రారంభమైంది. అయితే ఈ టోర్నీలో అక్టోబర్ 24న భారత్ తన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ మ్యాచ్ కు తాను మాయం అయిపోతున్నట్లు భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన…
గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి రోజున 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారంటే అర్థం చేసుకొవచ్చు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండిపోవడంతో నీటికి దిగువ ప్రాంతాలకు వదులుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద పోటెత్తింది. నదీ ఉగ్రరూపం…
తమిళనాడులో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. అక్టోబర్ 2 వ తేదీన బురదలో కూరుకొని ఒ నాలుగేళ్ల ఏనుగు మృతిచెందింది. చనిపోయిన ఏనుగు సుమారు 1500 కేజీలు ఉండటంతో… చనిపోయిన ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారు. కానీ, ఏనుగు చనిపోయిన ప్రాంతానికి సమీపంలోని గ్రామానికి చెందిన పంచాయతీ బావి ఉన్నది. ఏనుగును అక్కడే ఖననం చేస్తే ఆ ప్రాంతంలోని బావి కలుషితం అవుతుందని గ్రామస్థులు చెప్పడంతో ఏనుగును అక్కడి నుంచి తరలించాలని అనుకున్నారు.…
ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో ఉన్నాం. మరుగుదొడ్డి లేని ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేశాయి. అంటే మనిషి మొబైల్ ఫోన్లకు ఎంతలా అడిక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతుండటంతో అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోతుంది. కాళ్లు కదపకుండానే అన్ని నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. గుండుసూది నుంచి లక్షలు ఖరీదు చేసే వస్తువుల దాకా ప్రతీఒక్కటి ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. ఇలా ఆర్డర్ ఇచ్చామో లేదో అలా…
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్‌బుక్‌తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. …
కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు…