పెళ్లి వేడుకలకు వందలాది మంది అతిథులు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తుంటారు. మెక్సికోలోని న్యూవో లియోన్ పర్వత ప్రాంతంలో ఇటీవలే ఓ వివాహ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన అతిథుల కోసం రిసెప్షన్ హాలులో భోజనం ఏర్పాట్లు చేశారు. అందరూ భోజనాలు చేస్తుండగా అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. దాన్ని చూసి జనాలు హడలిపోయారు. అయితే, వారిని ఏమి చేయని ఆ అతిథి ఎలుగుబంటి అక్కడ ఉన్న…
ఐస్‌క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్లను తయారు చేస్తుంటాయి. అన్ని కంపెనీలలోకి బెన్ అండ్ జెర్రీ కంపెనీ వేరుగా ఉంటుంది. యూఎస్‌లోని వెర్మెంట్లో వాటర్బర్నీ అనే గ్రామంలో 1978లో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను స్థాపించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను తయారు చేసేవారు. వినియోగదారులకు నచ్చని ఐస్‌క్రీమ్‌లకు వాటి ఫ్లేవర్ల రూపంలోనే పార్లర్సమీపంలో సమాధి చేసేవారు. సమాధిపై ఆ ఐస్‌క్రీమ్‌ను…
అడవికి రాజు సింహం. సింహం ఎదురుగా వస్తుంటే అన్ని జంతువులు భయపడి పారిపోతుంటాయి. అయితే, ఓ చిన్న జంతువు సింహాన్ని ఎదిరించి నిలబడింది. గాంభీర్యంగా నిలబడి ఉన్న సింహాన్ని తనదైన శైలిలో భయపెట్టింది. అక్కడి నుంచి పారిపోయేలా చేసింది గ్రామంసింహం. గ్రామ సింహాలు అని కుక్కల్ని పిలుస్తారు. ఊర్లోకి ఎవరైన కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటపడి కరుస్తాయి. లేదంటే పెద్దగా అరిచి భయపెడుతుంటాయి. అడవిలో ఉన్న ఓ సింహం రోడ్డు మీదకు వచ్చింది. అలా వచ్చిన సింహాన్ని…
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా..! ఈ మూడు సోషల్ మీడియా యాప్స్ మన జీవితంలో భాగమైపోయాయి. ఉదయం నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే కాలక్షేపం. అన్ని అప్డేట్స్ అందులోనే చూసి తెలుసుకుంటున్నాం..! ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. ఐతే సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక… వివాదాలు మొదలయ్యాయి. ఫేక్‌న్యూస్‌పై జూకర్బర్గ్ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాట్సాప్, ఇన్‌స్టాలకు కూడా ఫేస్బుక్ పేరెంట్ కంపెనీలా ఉంది. దాంతో వివాదాలతో ఫేస్బుక్ ప్రతిష్ట దిగజారుతుందని…
ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి వాతావరణ కాలుష్యం. వాతారవణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కాలుష్యాన్ని పెంచే శిలాజఇంధనాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. దీనికి ప్రభుత్వాలు కోట్ల డాలర్ల సబ్సిడీలు ఇస్తున్నాయి. ఈ సబ్సిడీకోసం వినియోగిస్తున్న నిధులను ప్రపంచంలోని పేదలకు పంచితే వారు పేదరికం నుంచి కొంతమేర బయటపడతారు. ఈ విషయాలను చెప్పింది ఎవరో కాదు.. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓ డైనోసార్. Read:పాక్ రోడ్లపై ఆస్ట్రిచ్ పరుగులు…మండిపడుతున్న…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి పనీ చాలా సులభం అయింది. ఇడ్లీ, దోశలు, చపాతి వంటి బ్రేక్‌ఫాస్ట్‌లు తయారు చేయడానికి కూడా మెషీన్లను వినియోగిస్తున్నారు. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ, చేయి తిరిగిన వంటవాళ్ల ముందు అవన్నీ దిగదుడుపే కదా. ఏది ఎలా వండితే బాగుంటుందో ఒక వంట మనిషికి తెలిసినట్టుగా మెషీన్లకు ఎలా తెలుస్తుంది చెప్పండి. పెద్ద పెద్ద హోటల్స్‌లో మెషీన్లను వినియోగించినా అక్కడి వంటల టేస్ట్ పెద్దగా ఉండదు. కానీ, స్ట్రీట్…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్‌గాళ్లు.. వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్‌లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ..…
పంట పొలాలపై నిత్యం పక్షులు దాడిచేసి పంటను తినేస్తుంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి పొలంలో రైతులు దిష్టిబొమ్మలు, ఎర్రని గుడ్డలు వంటిని ఏర్పాటు చేస్తుంటారు. లేదంటే డప్పులతో సౌండ్ చేస్తుంటారు. అయితే, 24 గంటలు పొలంలో ఉండి వాటిని తరిమేయాలి అంటే చాలా కష్టం. దీనికోసం ఓ రైతు వేసిన పాచిక పారింది. పక్షులు పరార్ అయ్యాయి. ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. మాములు ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ తీసుకొని దాని రెక్కలు తొలగించాడు.…
ఫ్యాషన్‌గా ఉండాలని అందరికీ ఉంటుంది. రంగురంగుల దుస్తులు, వివిధ రకాల హెయిర్ స్టైయిల్‌తో మహిళలు బయటకు వస్తుంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. నలుగురు నడిచిన బాటలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ఈ మహిళ కొత్తగా ఆలోచించింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా హెయిర్‌కి హెయిర్ పిన్ లేదంటే రబ్బర్ బ్యాండ్ వంటివి పెట్టుకుంటుంటారు. అయితే, ఈ మహిళ కాస్త భిన్నంగా ఆలోచించి తల…
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పదనం తెలిస్తే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని విజయాలైనా సాధించేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వివాహితకు, మరో వ్యక్తికి మధ్య ప్రేమ చిగురించవచ్చు. వారి మనసులు కలిసిపోవచ్చు. చెప్పలేం. ఇలానే ఓ వివాహితతో ఓ వ్యక్తికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను ఆ వ్యక్తి చాలా అందంగా లేఖలో ఇలా వర్ణించాడు.…