నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంది హైకోర్టు. ఈమేరకు పోలీసులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్. ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసి సమాజంలో…
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. అర్హతకలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో 80 శాతం మంది వరకు మొదటి డోసు తీసుకున్నారు. 60 శాతానికిపైగా ప్రజలు రెండో డోసు తీసుకున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్రెజిల్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నది. ప్రజలు మాస్క్ పెట్టుకోనవసరం లేదని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు బొల్సోనారో చెప్పడంతో మాస్క్ పెట్టుకోకుండా తిరిగారు. దీంతో ఆ దేశంలో కరోనా విలయతాండవం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. చేతులు కాలాక అకులు పట్టుకున్న చందాన, కరోనా మహమ్మారి విజృంభణ తరువాత మాస్క్ తప్పనిసరి చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అప్పటి నుంచి అధ్యక్షుడు…
హైదరాబాద్ ఖాజాగూడలోని కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. కరాచీ బేకరీలో కొన్న స్వీట్లలో బూజు ఉందంటూ ఓ వ్యక్తి తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన… వెంటనే కరాచీ బేకరీపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు. ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. బేకరీలోని…
ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాదికి విషెష్ చెబుతూ 2021లో తనకు బాగా నచ్చిన ఓ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. తండ్ర తన కొడుకును తోపుడు బండిపై తీసుకెళ్తుండగా, కొడుకు బండి మీదున్న పాత సూట్‌కేసుపై కూర్చొని క్లాస్ పుస్తకం చదువుకుంటూ బిజీగా ఉన్నాడు. కొడుకు చుదువుకుంటున్న తీరును చూసి ఆ తండ్రి ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నట్టుగా చెమటను తుడుచుకుంటూ కొడుకువైపు చూస్తున్నాడు.…
హైదరాబాద్‌లో వాహనదారుల్లో చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటలకు 60 కి.మీ. స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు…
ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.…
సోషల్ మీడియాలో కామెంట్లు శృతిమించుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. సెలబ్రిటీలు, రాజకీయనేతలు, సినీతారలు.. ఇలా ఒకరిని కాదు.. అసభ్యకరమైన బూతులు, కామెంట్ల రూపంలో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ కుమారుడిపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి వ్యక్తిత్వ దాడిని అరికట్టలేమా?
స్పైడర్ మ్యాన్ సీరిస్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పేరుతో వచ్చిన మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. స్పైడర్‌మ్యాన్ గెటప్ ఎలా ఉంటుందో, ఎలాంటి రంగుల్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కింద ప్యాంట్ బ్లూరంగులోనూ, పైభాగం రెడ్ కలర్‌లోనూ ఉంటుంది. అలాంటి రంగుల్లో స్పైడర్ మ్యాన్ మాత్రమే కాదు, స్పైడర్ మ్యాన్ లిజర్డ్ కూడా ఉందట. నడుము నుంచి కిందభాగం నీలం రంగులోనూ, పైభాగం…
వ్యాపారంలో ఎంతటి బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. రీసెంట్గా ట్విట్టర్లో కాళ్లు చేతులు లేని ఓ దివ్యాంగుని వీడియోను పోస్ట్ చేశాడు. కాళ్లు చేతులు లేకున్నా ఆత్మాభిమానంతో టూవీలర్‌ను తనకు అనువైన వాహనంగా మార్పులు చేయించుకొని ఒకచోట నుంచి మరోక చోటుకు వస్తువులను చేరవేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. Read: నమ్మకాలు: కొత్త సంవత్సరం రోజున ఇలా చేస్తే……