ఏపీలో జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రెండు పథకాలను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాక్ట్‌చెక్ టీం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2022 ఏడాదికి గాను ఈ రెండు పథకాలు రద్దు చేసినట్లు కొందరు ఫేక్ ప్రెస్‌నోట్ సృష్టించారని తెలిపింది. వాళ్లను గుర్తించామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఫ్యాక్ట్‌చెక్ టీం స్పష్టం చేసింది.
కాగా ప్రతి ఏడాది జూన్‌లో అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలకు సంబంధించిన నగదును ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. వరుసగా మూడో ఏడాది అమ్మ ఒడి డబ్బులను అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జూన్ 21న అమ్మ ఒడి డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను కూడా అనర్హుల జాబితాలో వేయడం ఆందోళన కలిగిస్తోంది.
A fake message is being circulated and being represented as a Government notification.
Few accounts which started this malicious campaign have been identified. The information has been shared with the Cyber Crime Department.
Official action will be initiated. #FactCheck pic.twitter.com/sOeTnbtIdQ
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 30, 2022