మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అయితే నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) గురించి తెలియకుండా ఉండదు.. ఒక్కసారైనా ఆమె వీడియోను చూడలేదు అన్నా, లేక మీ ఫ్రెండ్స్ కు పంపలేదు అన్నా మీరు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం లేదనే అర్ధం.. తన కామెడీ రీల్స్ తో నిహారిక చేసే వినోదం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఆమె యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉండేది. యాదృచ్ఛిక భారతీయ అమ్మలు, కఠినమైన భారతీయ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులపై వీడియోలను రూపొందించడం నుండి మన దేశంలో రోడ్ రేజ్ వరకు ఆమె చేసిన వీడియోలు మిమ్మల్ని నేలపై దొర్లించి నవ్విస్తాయి. ఇక ముఖ్యంగా రియలిస్టిక్ గా మనం రోజూ మన బంధువుల నుంచి, స్నేహితుల నుంచి ఎలాంటి ఇబ్బందికరమైన సన్నివేశాలను ఎదుర్కొంటామో అలాంటివే నిహారిక రీల్స్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. అందరికి అర్ధమయ్యే సులువైన ఇంగ్లిష్ ను తనదైన స్లాగ్ లో మాట్లాడుతూ నవ్వులు పూయిస్తుంది.
రోడ్డు మీద వెళ్తూ కారు ఆగినప్పుడు మనసులో ఫీలింగ్స్.. కాలేజ్ లో డేటింగ్ చేయాలనుకున్నప్పుడు అమ్మాయిలు ఏమనుకుంటారు. 25 ఏళ్లు వచ్చినా బయటికి వెళ్లాలంటే అమ్మను పర్మిషన్ అడిగినప్పుడు, స్కూల్ లో టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ ఎలా ఉంటుంది.. ఇలా మన చుట్టూ ఉండే అనుభవాల్నే ఆమె రీల్స్ లో తన ఒరిజినల్ వాయిస్ తో చెప్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో నిహారికకు 2.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక నిహారిక గురించి చెప్పాలంటే.. ఆమె కుటుంబం మొత్తం దక్షిణాది నుండి వచ్చింది.. దీంతో తెలుగు, తమిళ్ తో పాటు దక్షిణాది భాషలన్నీ ఆమె అనర్గళంగా మాట్లాడగలదు. ఇక మొట్ట మొదట యూట్యూబ్ లో వీడియోస్ చేసినప్పుడు కొద్దిగా భయపడిన తన స్నేహితుల సాయంతో కొద్దికొద్దిగా ఎదుగుతూ వచ్చింది. ఆమె వీడియోలు చాలా వైరల్‌గా మారాయి, రకుల్ ప్రీత్ సింగ్ మరియు రెజీనా కసాండ్రా, సమంత వంటి వారు కూడా ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించడం ప్రారంభించారు. దీంతో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి స్టార్లు సైతం వారి సినిమా ప్రమోషన్స్ ను చేయించేస్తున్నారు.
మొదటిగా ‘దుర్గమతి’ గురించి భూమి పెడ్నేకర్‌తో కలిసి నిహారిక ఒక వీడియో చేసింది. అది వైరల్ గా మారింది. ఇక తరువాత నిహారిక వెనుతిరిగి చూడలేదు.. బాలీవుడ్, కోలీవుడ్, మల్లివూడ్, శాండిల్ వుడ్ అని లేకుండా స్టార్ హీరోలు సైతం ఆమెతో వీడియో లో కనిపించి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ‘కెజిఎఫ్ 2’ హీరో యష్, ఇక ఎప్పుడు ఇలాంటి సోషల్ మీడియా రీల్స్ లో కనిపించని మహేష్ బాబు సైతం నిహారిక తో వీడియో చేశాడు. ‘సర్కారు వారి పాట’ చిత్రం ప్రమోషన్స్ లో నిహారిక తో కలిసి ఒక ఫన్నీ వీడియో చేశారు. ఇక తాజాగా మరోసారి మహేష్ మేజర్ కోసం నిహారికకు రంగంలోకి దింపాడు. ఈసారి అడివి శేష్ కూడా వీడియోలో నిహారిక తో కనిపించి నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇటీవల కేన్స్ 2022 లో కూడా నిహారిక మెరిసింది. యూత్ ఐకాన్ ఎంటర్ టైన్మెంట్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నిహారిక వీడియోలపై ఓ లుక్కేయండి.