రీసెంట్‌గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. హాట్ బ్యూటీ రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. మరింతగా అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. దాంతో కొంచెం హాట్‌గా కనిపించి ఔరా అనిపించింది. అయితే హాట్‌గా కనిపించడానికి నానా తంటాలు పడింది. దాంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక టార్గెట్ ఏంటి.. ఏ విషయంలో ఇబ్బంది పడింది..?
తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లోను కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాంతో బాలీవుడ్ పై గట్టిగానే ఫోకస్ చేస్తోంది. అందులోభాగంగా.. బీ టౌన్‌లో హాట్ హాట్‌గా దర్శనమిస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. రీసెంట్‌గా ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తన బర్త్‌డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్సే కాదు.. టాలీవుడ్ నుంచి కూడా కొందరు స్టార్స్ తళుక్కుమన్నారు. రష్మిక, రకుల్, చార్మీ, పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, తమన్నా వంటి స్టార్స్.. ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే వీరిలో రష్మిక సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా నిలిచింది. పార్టీ వేర్‌లో కొంచెం హాట్ ట్రీట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన డ్రెస్‌తో కొంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ బ్లాక్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించిన రష్మిక.. కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. డ్రెస్‌ను పదే పదే సర్దుతూ అన్ కంఫర్టబుల్‌గా కనిపించింది. ఇదంతా చూసిన నెటిజన్స్ ఆమెను రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కంఫర్ట్‌గా లేనప్పుడు.. అలాంటి డ్రెస్ వేసుకోవడం అవసరమా.. అని ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో బొద్దుగా వుండే రష్మిక.. కాస్త సన్నబడినట్టు కనిపిస్తోంది. దాంతో రష్మిక ఎందుకింతలా బక్క చిక్కిపోయిందంటు ట్రోల్ చేస్తున్నారు. అయితే రష్మిక బాలీవుడ్‌ను టార్గెట్ చేయడం వల్లే.. హాట్‌గా కనిపిస్తునే.. స్లిమ్‌గా కూడా మారిపోయిందని అంటున్నారు.