Charan : ఈసారి ఫారిన్‌లో ప్లాన్ చేసిన చరణ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుడప్పుడూ సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం.. ఫారిన్ వెళ్తుంటారు రామ్ చరణ్. ఇక ఇప్పుడు కూడా ఓ ఫారిన్ ట్రిప్ వేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. సడెన్‌గా వెకేషన్‌కు వెళ్లడానికి ఓ బలమైన కారణమే ఉంది. తన వైవాహిక జీవితంలో.. చరణ్‌కు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలవనుంది. అందుకే విదేశాల్లో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. ఇంతకీ చరణ్ ఎక్కడికి వెళ్తున్నాడు.. ఎందుకోసం వెళ్తున్నాడు..!
Also Read
ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా.. కెరీర్‌లోనే బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు చరణ్. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆచార్య ఫ్లాప్ అవడంతో.. కాస్త డీలా పడిపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు.. ఆ సినిమాను శంకర్ తెరకెక్కిస్తుండడంతో.. అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. చరణ్ ఇప్పుడు ఓ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ నెల 14న రామ్‌చరణ్ పెళ్లి రోజు కావడంతో.. విదేశాలకు పయనమయ్యారు చరణ్, ఉపాసన జోడి. 2012 జూన్ 14న వీరి పెళ్లి అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఏడాదితో వీరి పెళ్లి జరిగి పదేళ్లు కానున్నాయి. దాంతో తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉండే ఈ సెలెబ్రిటీ కపుల్.. టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా జరుపుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఈ సారి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ను ఇటలీలోని మిలాన్‌లో జరుపుకోబోతున్నట్లు సమాచారం. అక్కడ నాలుగైదు రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఇకపోతే..పెళ్ళైన తర్వాత నటుడుగా రామ్ చరణ్.. బిజినెస్ ఉమన్‌గా ఉపాసన ఫుల్ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!