కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు కర్నూలు పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భార్య అన్నా లెజినోవా, వాళ్ల కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట యువకులు.. దీనిపై గుంటూరులో సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ముగ్గురు యువకులు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు..
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో యువతీయువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు-ఇద్దరు యువతుల మధ్య ఫైటింగ్ సాగింది. పిడిగుద్డులు, బెల్టుతో కొట్టుకోవడం కనిపించింది.
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు... సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు..
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి దంపతులు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని మార్క్‌ను కలిశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స…
Viral Video: ప్రతి నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో కొన్ని ఆనందాన్ని పంచుతే, మరికొన్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. అప్పుడప్పుడు అడవి జంతువుల సంబంధించి అనేక వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సింహం సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్థరాత్రి ఇంట్లో ఏదో కదిలిన శబ్దం విని మీరు మేల్కొని బయటికి వచ్చేసరికి ఓ సింహం ముందే నిలబడి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి…
ఓ ప్రయాణికుడు.. డాగ్‌తో కలిసి రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. పెంపుడు కుక్క రన్నింగ్ ట్రైన్ ఎక్కలేక ఫుట్‌పాత్-రైలు మధ్యలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.