Rohit Sharma: ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండండి.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది.
Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల కోసం పాక్ ప్రయత్నాలు
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
కానీ, భారత భద్రతా దళాలు ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. ఆ తర్వాత భారత్ మళ్లీ పాక్‌పై సమాధానాత్మక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, వీటిలో చాలావరకు వీడియోలు నకిలీవని AI సాంకేతికత ద్వారా తయారైనవని ఫ్యాక్ట్ చెకర్లు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. తెలుగు జవాన్ వీరమరణం..
With every passing moment, with every decision taken I feel extremely proud of our Indian Army, Indian Airforce & Indian Navy. Our warriors are standing tall for our nation’s pride. It’s important for every Indian to be responsible and refrain from spreading or believing any fake…
— Rohit Sharma (@ImRo45) May 9, 2025
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భారత సాయుధ దళాలపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి తన మద్దతును తెలియజేశారు. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మన భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం పట్ల నాకు గర్వంగా ఉంటుంది. మన యోధులు దేశ గౌరవాన్ని కాపాడేందుకు నిలబడి ఉన్నారని రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాక, భారత ప్రజలందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ, ఫేక్ న్యూస్‌ను నమ్మకూడదనీ, దానిని పంచుకోకూడదనీ తెలిపారు. అలాగే ప్రతీ భారతీయుడు బాధ్యతగా ఉండాలి. ఏదైనా అప్రమత్తత లేకుండా నమ్మే ఫేక్ న్యూస్ వల్ల అనవసర భయం, అపోహలు వ్యాపిస్తాయని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ తన ఖాతాలో తెలిపాడు. ఇక తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్ అవుతున్నట్లు తెలిపిన విషయం తెలిపిందే.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!