Kadiyam Srihari : మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు. ధండోరా ఉద్యమానికి నేను అన్ని సందర్భాలలో ముందు ఉండి నడిపిచానని, ఉద్యమానికి ప్రధాన కారణం మంద కృష్ణ మాదిగ అని నేను ఒప్పుకుంటున్న, ఐనవాళ్లే ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు కడియం శ్రీహరి. తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది,కానీ మనం ఓపిక గా ఉండాలని, సుప్రీం కోర్టులో ఆరుగురు జడ్జిలు ఈ వర్గీకరణ కు మద్దతు ఇచ్చారు, ఒక్క జడ్జి మాత్రమే మద్దతు ఇవ్వలేదన్నారు కడియం శ్రీహరి.
MP Sri Krishnadevarayalu: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ
నేను షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ పొంది నేను ఈ స్థాయిలో వున్నానని, క్రీమి లేయర్ ని మనం ఒప్పుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ని మనం తప్పు పట్టనవసరం లేదని, మంద కృష్ణ మాదిగకు, కడియం శ్రీ హరికి ఎంత చిత్త శుద్ది ఉందో రేవంత్ రెడ్డి కి కూడా అంత చిత్త శుద్ధి ఉంది వర్గీకరణ విషయంలో అని ఆయన తెలిపారు. కమిషన్ రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తదని ఆయన పేర్కొన్నారు. మన వర్గీకరణకు మద్దతు తెలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని, కేంద్ర ప్రభుత్వంకి బాధ్యత లేదా, సుప్రీంకోర్టు తీర్పు వెల్లువడగానే ఎందుకు మీరు మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
AP Govt: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. నూతన క్రీడా పాలసీకి ఆమోదం