దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.
గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలవలేదని, నేతన్నల జీవితాలను తన పాదయాత్రలో గమనించా గనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్ తెలిపారు.
ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. ఇవాళ 80, 546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్‌లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మాది. కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్రంలో విపక్షాలు తప్పుడు విమర్శలు చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకుంటున్నారని, జరుగుతున్న మంచిని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. అన్ని వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామన్న ఆయన.. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదరికం నుంచి మహిళలు, బలహీనవర్గాలు బయటపడాలి. పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. వందశాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ అందిస్తున్నాం. పిల్లలకోసం విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. నాడు నేడు ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మారుస్తున్నాం. 31 లక్షలమందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నాం. శరవేగంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది.
రెండుమూడు లక్షల కోట్లు ఇళ్ళ ఆదాయం అక్కాచెల్లెమ్మలకు అందించబోతున్నాం. ప్రతి పథకం మహిళల గురించి ఆలోచించాం. ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయని జీర్ణించుకోలేనివారున్నారు. కుళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళున్నారు. కుట్రదారులు ఎలా వున్నారో చూడండి. అప్పట్లో ఇచ్చిన సీఎం పదవి తమ వాళ్ళ కోసం. తన ఎల్లో మీడియా కోసం.. రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా చేశారు. గతంలో చేసిన పాలన DPT స్కీం చేశారు. ఆనాడు ఉన్నది ఇదే బడ్జెట్.., ఆనాడు ఉన్నది ఇదే రాష్ట్రం. మన రాష్ట్రంలో అప్పులు తక్కువే చేస్తున్నాం. మనం ఇప్పుడెలా చేస్తున్నాం. లక్షా 65 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు బటన్ నొక్కి ఇవ్వగలిగాం. ఇవాళ వివక్ష లేదు.. లంచాలు లేవు. నేరుగా అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి. నాకు వీళ్ళమాదిరిగా పత్రికలు, టీవీ ఛానెళ్ళు లేవన్నారు. అనంతరం నేతన్న నేస్తం పథకం ద్వారా నిధులు విడుదలచేశారు సీఎం జగన్.
Read Also: Russia Live Focus on Six Months of Russia-Ukraine War 2022