ఏపీలో సామాజిక న్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందన్నారు మంత్రి జోగి రమేష్. గతంలో అనేకమంది బలహీనవర్గాల వారు సీఎంలుగా చేశారు.. కానీ సామాజిక న్యాయం చేసింది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్టీ, ఎస్సీలు మైనారిటీల మీద ప్రేమ ఉంటే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతున్నా.. 2014 నుంచి 2019 వరకూ సామాజిక న్యాయం ఏం చేశావు.. 2019 నుంచి 2023 వరకూ జగన్ హయాంలో సామాజిక న్యాయం ఏం జరిగిందో చర్చిద్దాం.. ఆ చర్చలోనే చంద్రబాబు బట్టలిప్పి పారిపోయేలా చేస్తాం అన్నారు మంత్రి జోగి రమేష్. బలహీనవర్గాల వారికి డీబీటీ ద్వారా 2 లక్షల కోట్లు వారి చెంతకు చేర్చాం.. చంద్రబాబు హయాంలో ఆయన తాబేదార్లకు న్యాయం జరిగింది. చీఫ్ మినిస్టర్ టు కామన్ మేన్ బటన్ నొక్కుతుంటే.. ప్రతి గడపగడపకు న్యాయం జరుగుతోంది. బీసీ మేధావులు, బీసీలలో ఉన్న ఉపాధ్యాయులు అన్ని వర్గాల వారు జగన్ పక్షాన అడుగులు వేయాలని మంత్రి జోగి రమేష్ కోరారు.
Read Also: Tipu Sultan Issue: టిప్పు పేరు వాడకండి.. చర్యలు తీసుకుంటామని వారసుల హెచ్చరిక
సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం అన్నారు. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్మేసుకున్నారన్నారు. ఒక జాలరి చట్టసభకు వెళుతున్నారంటే, ఒక వడ్డీ కులస్తులు శాసనమండలికి వెళుతున్నాడంటే అదంతా జగన్ చలవే అన్నారు. ఇవాళ బీసీలు అందరూ తలెత్తుకుని తిరగగలుగుతున్నారు. జాతీయ పార్టీలు కూడా జగన్ మార్గంలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి జోగి రమేష్. గన్నవరం సంఘటన గురించి నాకు తెలియదు.. చూసిన తర్వాత స్పందిస్తానన్నారు జోగి రమేష్. శాసనమండలి ఎన్నికల్లో ఎస్.సి.ఎస్ టి…బి.సి లకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. ఎమ్.ఎల్.ఏ.లు..ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించాం. రేపు ఎం.ఎల్.సి.అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు.స్థానిక ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తాం అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ముఖ్యమంత్రి జగన్ బీసీలకు పెద్దపీట వేశారన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చెప్పిన దాని కంటే బీసీలకు ఎక్కువ చేశారు.14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఒక్కరిని కూడా రాజ్యసభ కు పంపలేదు. భారతదేశం చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో చట్టసభల్లో అవకాశం ఇచ్చిన నాయకుడు లేడు. తన పాలనలో బీసీలకు చంద్రబాబు, నాలుగేళ్ళలో జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమా? చంద్రబాబు ఉండి ఉంటే ఇప్పుడు కౌంటర్ తెరిచి ఉండేవాడు. 18 మండలి స్థానాలను డబ్బులు ఇచ్చిన వారికి అమ్మి ఉండేవాడన్నారు మంత్రి కారుమూరి.
Read Also: India found deposit of lithium: బ్యాటరీలు, ఈవీ మార్కెట్‌లో ఇక మనదే హవా