Sikkim: తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత ఆర్మీ సైనికులు బుధవారం రక్షించారు. అధికారుల ప్రకారం, ఈ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా హిమపాతం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
Jammu & Kashmir Snowfall : జమ్మూలో పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అక్కడ కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి.
Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్‌లోనే కాదు ఇంగ్లండ్‌లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్‌కు ముందే లండన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు…
snowstorm buries western New York: అమెరికా వాణిజ్యనగరం న్యూయార్క్ వ్యాప్తంగా భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజా జీవితం స్తంభించింది. బఫెలో ప్రాంతంలో రోడ్లు మూసేశారు. అనేక విమానాలు రద్దు అయ్యాయి. నగరంలో ప్రయాణాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.