Oval Stadium: క్రికెట్ మైదానాన్ని కప్పేసిన మంచు.. హిమాలయాలను తలపిస్తున్న స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oval Stadium: ప్రస్తుతం శీతాకాలం సీజన్ నడుస్తోంది. భారత్‌లోనే కాదు ఇంగ్లండ్‌లోనూ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. క్రిస్మస్‌కు ముందే లండన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అటు యూకేలోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు మైనస్ 10-12 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఓవల్ మైదానాన్ని రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఓవల్ మైదానం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి నెటిజన్‌లను ఆకట్టుకుంటున్నాయి. ఓవల్ మైదానం హిమాలయాలను తలపిస్తుందని, అసలు ఇది క్రికెట్ గ్రౌండ్ అని ఎవ్వరూ అనరని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓవల్ మైదానంలో క్రికెట్‌కు బదులు ఐస్ హాకీ ఆడుకోవచ్చని పలువురు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Read Also: ఈ అలవాట్లు ఉంటే బెడ్‌రూంలో వీక్ అయిపోతారు.. జాగ్రత్త..!!
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా 1845లో ఓవల్ మైదానాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో 23,500 మంది మ్యాచ్‌ను వీక్షించవచ్చు. 1880లో ఇక్కడ తొలి టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన రెండో మైదానంగా ఓవల్ గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఇంగ్లండ్ ఓవల్ మైదానం వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ జరగనున్నాయి. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానంలో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌ను ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
The OVAL – under snow. pic.twitter.com/LQmDCQugLc
— Azhar Mahmood (@AzharMahmood11) December 12, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!