గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ…
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కార్మికులు సొంతూర్లకి పయనమవుతున్నారు. ఇటీవలి రోజుల్లో టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకోవడంతో తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అధికారులకు కార్మికులు చెబుతున్నారు. టన్నెల్‌లో పని చేయాలంటే భయంగా ఉందని, పనులు ముందుకు సాగుతాయో లేదో అని కార్మికులు అంటున్నారు. జార్ఖండ్, బీహార్, యూపీ, హర్యానాలకు కొందరు ఎస్‌ఎల్‌బీసీ కార్మికులు బయల్దేరారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దాదాపుగా…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 144 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే.. గురువారం సహాయ చర్యల్లో వేగం పుంజుకుంది. టన్నెల్‌లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)ను ప్లాస్మా కట్టర్లతో రెస్క్యూ టీమ్ ముక్కలుగా కత్తిరింస్తోంది. మిషన్‌పై భారీగా ఉన్న బురద, మట్టి, రాళ్లను తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు. సిల్ట్, మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. 12వ కిలోమీటరు నుంచి…
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక…
KTR : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. “ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ,…
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం…
SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్…
Uttam Kumar Reddy : శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్‌లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఈరోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమండో ఫోర్స్ (మార్కోస్) చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలకు దిగే సత్తా ఈ మార్కోస్కు ఉంటుంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీమ్ పాల్గొననుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్సింగ్ తన బృంద సభ్యులతో టన్నెల్ వద్దకు రానున్నారు.…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుని 72 గంటలు (మూడు రోజులు) గడుస్తున్నా.. సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు. టన్నెల్లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్లోకి వెళ్లి.. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎల్ అండ్ టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజి నిపుణులు సహాయ చర్యల్లో ఉన్నా.. ఫలితం లేదు. టన్నెల్లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రెస్క్యూ బృందాలు…