SLBC Tunnel: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రక్షణ చర్యల్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు కూడా చేయబడింది. ఇక తాజాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటికి తీసేందుకు అధికారులు ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలోకి దించారు. ప్రత్యేకంగా ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు ఢిల్లీ నుండి…
SLBC : తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), భారత సైనిక బృందాలు (Indian Army Teams) రంగంలోకి దిగాయి. ప్రమాద స్థితిని అంచనా వేసి రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయడానికి సింగరేణి…
SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్న, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు…
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట…
రెండేళ్లలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు.. జిల్లాలో కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు.. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను రాబోయే రెండెళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు అమెరికాలోని ఒహయోలోని రాబిన్స్ టన్నెల్…
KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.