నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. గంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలా ఐనా సరే.. ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి…
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరికొద్ది సేపట్లో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.
నీటి ఊట.. టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకంగా మారింది. నీరు నిరంతరాయంగా వస్తోంది. నీరు ఎక్కడి నుంచి వస్తుందో జియోలాజికల్ సర్వే టీమ్ అన్వేషిస్తోంది. టన్నెల్ పైభాగంలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిర్మలాపూర్ సమీప ప్రాంతం లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ టీమ్ సర్వే నిర్వహించాయి. మల్లెల తీర్థం నుంచి కృష్ణా నది వైపు…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మొదటగా ఉదయం 11.30 గంటలకు వనపర్తి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేసి, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా…
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.
SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను…
SLBC Incident : తెలంగాణలోని SLBC (శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్) టన్నెల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5…