అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్‌కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
గ్రేటర్ నోయిడాలో ఒక యువకుడు రెచ్చిపోయాడు. ఒక మహిళను పట్టుకుని ఇష్టానురీతిగా దిడి చేశాడు. జుట్టుపట్టుకుని చెంపలు వాయించాడు. ఆమె దుర్భాషలాడాడు. దీంతో ఆమె దెబ్బలు తాళలేక ఇబ్బందులు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్వో, వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన అజిత్ సింగ్ నగర్ షాది ఖానా రోడ్డులో జరిగింది. వరదలు వచ్చినప్పటీ నుంచి ఫుడ్, కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినా.. సచివాలయం 259 వార్డు వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీంతో.. ఇదే విషయంపై వాగ్వివాదం జరగటంతో స్థానికుడిపై ఆగ్రహంతో వీఆర్వో చెంప చెళ్లుమనిపించింది.
యూపీ పోలీసుల ఓ సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న పిస్టల్ తీసి భయపెట్టాడు. కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.
ఉత్తర ప్రదేశ్లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
జైపూర్ ఎయిర్‌పోర్టులో ఇటీవల జరిగిన సంఘటన తీవ్రం అవుతోంది. విమానాశ్రాయంలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. భద్రతా సిబ్బంది ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాను కొందరు మంచి పనుల కోసం వినియోగిస్తోంటే, మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరైతే ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి రిక్వెస్టులు పెట్టడం, యాక్సెప్ట్ చేశాక మాయమాటలు చెప్పి వలలో వేసుకోవడం, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా, తాజాగా మరో వ్యవహారం తెరమీదకొచ్చింది. Read Also: YCP Leader Murder Case: పథకం ప్రకారమే వైసీపీ నేత హత్య.. ఆ…
తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ ప్రేమే కనిపిస్తోంది. ఇదిగో తాజాగా ఒక తల్లి ప్రేమ ఇలా కనిపించింది. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది. పాకిస్థాన్ ఎయిర్…