తల్లి ప్రేమ ఎవరు వర్ణించలేనిది.. ఆమె ప్రేమలో ఉండే స్వచ్ఛత వేరు.. తల్లీబిడ్డల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కరోజు బిడ్డ కనిపిచ్న్హకపోయిన ఆ తల్లి పడే బాధ చెప్పలేనిది.. తల్లి ప్రేమలోనే కాదు కోపంలోను ఆ ప్రేమే కనిపిస్తోంది. ఇదిగో తాజాగా ఒక తల్లి ప్రేమ ఇలా కనిపించింది. చాలా రోజుల తరువాత కొడుకును కలిసిన ఆనందం.. ఇన్నాళ్లు తనను చూడడానికి రాని కొడుకుపై కోపం రెండు ఒకేసారి చూపించింది. పాకిస్థాన్ ఎయిర్ పోర్టులోజరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పాకిస్థాన్ కి చెందిన అన్వర్ జలాని అనే వ్యక్తి తల్లి చాలా రోజుల క్రితం స్వదేశం వదిలి వేరో చోటుకు వెళ్ళింది. చాలా రోజుల తరువాత ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక తల్లి వస్తున్న ఆనందంలో అన్వర్ జలాని బొకే పట్టుకొని ప్లకార్డుపై మిస్ యూ అమ్మ అని రాసి తల్లికి ఎదురెళ్ళాడు. ఇంకేముంది కొడుకును చుసిన ఆ తల్లి వెంటనే చెప్పు తీసుకొని కౌగిలించుకోవడానికి వచ్చిన కొడుకును చెప్పు తీసుకొని చితకొట్టింది.. ఆ తరువాత వెంటనే కొడుకును హత్తుకొని కంటనీరు పెట్టుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అన్వర్ జలాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. తల్లి ప్రేమను ఎవరు వర్ణించలేరు.. ఇది కూడా తల్లి ప్రేమలో భాగమే.. కొడుకును ఎంతలా మిస్ అయ్యిందో.. ఇంతలా కొడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
https://www.instagram.com/p/CWjloLRA9zs/